ఇద్దరు తహశీల్దార్ లపై కేసు నమోదు.. కారణం ఏంటంటే ?

by Sumithra |
ఇద్దరు తహశీల్దార్ లపై కేసు నమోదు.. కారణం ఏంటంటే ?
X

దిశ, అమ్రాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో గల ఒక వ్యక్తి పేరు ఉన్న భూమిని.. ఎలాంటి రుజువు రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే మరొకరి పేరున భూ బదలాయింపునకు కారణమైన అమ్రాబాద్ తహశీల్దార్లుగా విధులు నిర్వహించిన ఇద్దరి పై కేసులు నమోదైనట్లు అమ్రాబాద్ ఎస్సై రజిని(Amrabad SI Rajini) ఆదివారం దిశకు ఫోను ద్వారా తెలిపారు. ఎస్సై కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన మాలే శంకరయ్య పై అమ్రాబాద్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 900 లో 1.10 గుంటల పట్టా భూమి వారసత్వంగా సంక్రమించగా ప్రజా అవసరాల కోసం ఎకరం భూమిని ప్రభుత్వ బస్టాండ్ కోసం దానం చేశాడన్నారు.

మిగిలిన 10 గుంటల భూమిలో ఐదు గంటల భూమిని ఎలాంటి క్రయవిక్రయాలు జరుపకపోయినా, అనుమతి పత్రాలు లేకుండానే గత తహశీల్దార్లుగా పనిచేసిన పాల్, కృష్ణయ్యలు పల్కపల్లి గ్రామానికి చెందిన అలీ అనే వ్యక్తికి ఐదు గంటల భూమిని బదిలాయించారు. ఈ విషయం పై బాధితుడు ఆర్డీవో, కలెక్టర్ వంటి కార్యాలయాలకు తరచూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించగా సాక్షాదారాలను పరిశీలించిన కోర్టు ఇద్దరు తహశీల్దారుల పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు అమ్రాబాద్ పోలీసులు ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed