మరణించిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటాంః ఎస్పీ శ్రీనివాసరావు

by Nagam Mallesh |
మరణించిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటాంః ఎస్పీ శ్రీనివాసరావు
X

దిశ,ఎర్రవల్లి : విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలను ఆదుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ జనవరి నెలలో అనారోగ్యంతో మరణించగా కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ క్రింద రూ.49,800/- విడో పెన్షన్ క్రింద రూ.10,000/- రూపాయల చెక్ ను బుధవారం హెడ్ కానిస్టేబుల్ భార్య రాజేశ్వరి కి ఎస్పీ శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కుటుంబ స్థితి గతులను, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలను తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏఓని ఆదేశించారు. ఈ కార్యక్రమములో కార్యాలయ ఏ.ఓ సతీష్, పాల్గొన్నారు.

Advertisement

Next Story