MLA : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

by Kalyani |
MLA : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
X

దిశ,దేవరకద్ర: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలన్నీ తూ.చ తప్పకుండా నెరవేరుస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక శ్రీనివాస ఫంక్షన్ హాలులో దేవరకద్ర టౌన్, బలుసుపల్లి, మినిగొని పల్లి, గోప్లపూర్, చౌదర్పల్లి గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమం లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన, గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ, గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ. 5000 వేల కోట్ల మిత్తి కట్టుకుంటూ, కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా అమలు చేస్తోందని అన్నారు.

అందులో భాగంగా అధికారం చేపట్టిన 2 రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, అక్కడక్కడ సాంకేతిక కారణాలతో రుణమాఫీ నిలిచిపోయిన రైతులకు, సమస్యను పరిష్కరించి రుణమాఫీ చేస్తామని తెలిపారు. మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లను తీసుకువచ్చామని, ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునేందుకు శిల్పారామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. స్కూల్ యూనిఫాంలో కుట్టే బాధ్యత, అమ్మ పాఠశాలలు పనులు సైతం మహిళా సంఘాలకు కేటాయించామని తెలిపారు. అక్టోబర్ 2 వ తారీకు నుంచి రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు.

దసరా నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, త్వరలో రైతుబంధు వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల అధ్యక్షులు అంజిల్ రెడ్డి, కౌకుంట్ల మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, అరవింద్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, లక్ష్మీ కాంత్ రెడ్డి, ఆది హనుమంత్ రెడ్డి, ఎర్రోళ్ల చంద్రయ్య , హనుమంతు,రాంపండు, నర్వ శ్రీనివాసరెడ్డి, షేక్ ఫరూక్ అలీ, కొండ శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి , గౌని రాము, బీరన్న, భరత్, అర్జున్ చారి, రామాంజనేయులు, చంద్రమౌళి, జి ఎస్ నరసింహ, వెంకటేష్, గోపాల్, మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈవో సీత్యానాయక్, ఏపిఎం రాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed