దసరా సెలవులపై ఇంటర్ లెక్చరర్ల అభ్యంతరం

by M.Rajitha |
దసరా సెలవులపై ఇంటర్ లెక్చరర్ల అభ్యంతరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : దసరా సెలవులపై జూనియర్ కళాశాల లెక్చరర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు పెంచాలని, గతంలో ఇచ్చిన తేదీలు మార్చాలని గవర్నమెంట్ మైనారిటీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ జబీ తమ సంఘం తరపున శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణలో హిందువులకు అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా పండుగలను పెద్దలు, పిల్లలు, ముఖ్యంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలకు, ఉన్నత విద్య పరిధిలోకి వచ్చే పాలిటెక్నిక్ కళాశాలలకు, అన్ని గురుకులాలకు, మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలకు అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ఇచ్చారన్నారు. కానీ ఇంటర్ విద్య పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు మాత్రం అక్టోబర్ 6 నుంచి సెలవులు ప్రకటించారని, అందరికీ ఒకేలా సెలవులు ఇవ్వాలని ఇంటర్ విద్య కమిషనర్ ను సయ్యద్ జబీ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed