Tight dresses affect: టైట్ డ్రెస్సెస్ వేసుకుంటే గుండెపై ప్రభావం చూపుతుందా? హెల్త్ ఎక్స్పర్ట్ ఏం చెబుతున్నారు!

by Anjali |
Tight dresses affect: టైట్ డ్రెస్సెస్ వేసుకుంటే గుండెపై ప్రభావం చూపుతుందా? హెల్త్ ఎక్స్పర్ట్ ఏం చెబుతున్నారు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మోడ్రన్ లుక్‌లో కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్ డ్రెస్సులో లుక్ సూపర్‌గా ఉన్నప్పటికీ పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఫ్యాషన్ ట్రెండ్స్ ఏంటి? వాటి వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..

టైట్ దుస్తులు ధరించడం..

బట్టలు టైట్‌గా వేసుకుంటే బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది. కానీ శరీరంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ సర్కులేషన్ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కడుపు నొప్పి, గుండె పనితీరు తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి. కాగా జాగ్రత్త.

ల్యాప్‌టాప్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్స్

చాలామంది కామన్‌గా బ్యాగులో ల్యాప్‌టాప్ పెట్టుకుని భుజంపై బ్యాగ్ వేసుకుని వెళ్తారు. అలాగే బ్యాగులో పలు వస్తువులు పెడతారు. దీంతో బరువు పెరిగి.. ఆ వెయిట్ కండరాలపై ప్రభావం చూపుతుంది. పైగా బ్యాక్ పెయిన్ వచ్చే చాన్స్ కూడా ఉంటుంది.

బాడీ పియర్సింగ్..

ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది శరీరంలో ఎక్కడపడితే అక్కడ పియర్సింగ్ చేయించుకోవడం కామన్ అయిపోయింది. కాగా ఇవి సరిగ్గా చేసుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని, బ్యాక్టీరియ్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పియర్సింగ్ చేయించుకున్న భాగంలో వాపు, పెయిన్ వస్తుంది.

టై వాడకం..

మగాళ్లు సూట్‌పైకి టైలు ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. కాగా వీటివల్ల పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైను టైట్‌గా పెట్టినట్లైతే బ్రెయిన్ కు సరఫరా తగ్గుతుంది. దీంతో మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది. భుజాలు, వీపు, మెడ పార్ట్స్‌లో స్ట్రెస్ పెరుగుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed