'ప్రతి ఒక్క సమస్యపై పోరాటం చేస్తాం'.. శివ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

by Vinod kumar |
ప్రతి ఒక్క సమస్యపై పోరాటం చేస్తాం.. శివ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
X

దిశ, నాగర్‌కర్నూల్: శివ సేన పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. నాగర్ కర్నూల్ పట్టణంలోని శిశు మందిర్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమానికి శివ సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసం వర్ష లో 27 వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివ సేన పార్టీ అధినేత ఏకనాథ్ షిండే చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతను స్వీకరించిన విషయం తెలిపారు. రానున్న రోజులలో శివ సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలోపెతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఎన్నికల్లో శివ సేన పోటి చేస్తుందని అన్నారు. కార్యకర్తల సంఖ్య పెంచేందుకు శివసైనికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేస్తామని తెలిపారు.


రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలలో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యలు మొత్తం గాలికీ వదిలేసి మహారాష్ట్ర చుట్టు తిరుగుతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రతీ ఒక్క సమస్య పైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువ సేన నాగర్ కర్నూల్ అద్యక్షులు విష్ణు, విద్యార్థి సేన నాగర్ కర్నూల్ అద్యక్షులు మారుతీ, ఉమ్మడి పాలమూరు జిల్లా యువ సేన ప్రదాన కార్యదర్శి సిజ్జు, నాగర్ కర్నూల్ జిల్లా యువ సేన ప్రదాన కార్యదర్శి శంకర్, విద్యార్థి సేన నాగర్ కర్నూల్ నియోజకవర్గ అధ్యక్షులు తరుణ్‌, శ్రీకాంత్, రాజు, బాను ప్రకాష్, ప్రశాంత్‌, శివ ప్రసాద్, మహేష్, అభి, సురేందర్‌, అంజి, అరవింద్‌, దీపక్‌, శివ, అర్జున్, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed