ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. నెలరోజులైనా పట్టించుకోని అధికారులు

by Aamani |
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. నెలరోజులైనా పట్టించుకోని అధికారులు
X

దిశ, నాగర్ కర్నూల్ : పార్లమెంట్ ఎన్నికల కోడ్ గత నెల 16న ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు తన స్వగృహం ముందు నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలు తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ఆ ఫ్లెక్సీలు తొలగించకపోవడంతో ఆ పార్టీకి ఎన్నికల కోడ్ వర్తించదా.? అని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా నడి రోడ్డు పై ఫ్లెక్సీలు కనిపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు మేల్కొని ఫ్లెక్సీలను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed