- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA : డ్రైవర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే..
దిశ, గోపాల్పేట్/ వనపర్తి : ఆయన ఒక ఎమ్మెల్యే.. హంగు ఆర్భాటం, నేను ఎమ్మెల్యే అన్న అహంభావం ఆయనలో మచ్చుకైన కనిపించవు. సాధారణ ప్రజానీకంతో సామాన్యుడిలా కలిసిపోయాడు. విద్యార్థుల, ఉద్యోగుల, ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని వనపర్తి పట్టణంలో సిటీ బస్సులో ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని గుర్తించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో లోకల్ సర్వీసును ప్రారంభించారు.
అందరూ ఎమ్మెల్యేల లాగానే ఏదో రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోలేదు ఆయనా.. పట్టణంలో 10 కిలోమీటర్ల బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే డ్రైవింగ్ చేస్తున్నాడన్న విషయం ఒక్క నిమిషంలో పట్టణం మొత్తంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దాంతో డ్రైవింగ్ చేసే ఎమ్మెల్యేలను చూసేందుకు పట్టణవాసులు, ప్రజలు ఎగబడి పోయారు.
ప్రజలతో మమేకమే ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి వనపర్తి ఎమ్మెల్యేగా రావడం వనపర్తి నియోజకవర్గానికి శుభసూచకమని వనపర్తి నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని మొదటగా వనపర్తి పట్టణ విద్యార్థుల, సామాన్య ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఈ బస్సును ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.