పట్టణాభివృద్ధి ఆగిపోరాదు.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

by Sumithra |
పట్టణాభివృద్ధి ఆగిపోరాదు.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోరాదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన పట్టణంలోని భగీరథ కాలనీలో పర్యటించి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. కాలనీలో‌ నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్ ఔట్ లెట్ పనులను పరిశీలించారు, అనంతరం నిరుపయోగంగా ఉన్న పార్క్ స్థలంలో మూడా నిధులతో పార్క్ నిర్మాణం చేపట్టాలని ముండా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ను ఆదేశించారు. అనంతరం కాలనీలో ఉన్నశిధిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ను ఆయన పరిశీలించి, నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయిన వెంటనే పాత ట్యాంక్ ను నిర్వీర్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్, మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్ ప్రశాంత్, సిరాజ్ ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉంది..

ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ క్యాలండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, టీటీయూ జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్, కార్యదర్శి గుడిసె యాదయ్య, జనార్దన్ రెడ్డి, రవికుమార్, విజయ్ మోహన్, బురాన్, నిరంజన్, హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed