ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ : ఒకరు మృతి

by Shiva |   ( Updated:2023-02-11 17:55:26.0  )
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ : ఒకరు మృతి
X

దిశ, కల్వకుర్తి : ఆగి ఉన్నలారీని ఓ బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కల్వకుర్తి శివారులోని శ్రీ కేతన్ వెంచర్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వంగూరు మండలం రంగాపూర్ కు చెందిన పవన్ (24) వృత్తిరీత్య ఫోటోగ్రాఫర్. పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై పంజుగుల నుంచి కల్వకుర్తికి తిరుగు పయనమయ్యాడు. ఇంతలో బైక్ కల్వకుర్తి శివారులోని శ్రీ కేతన్ వెంచర్ సమీపంలోకి రాగానే రోడ్డుపై ఏపీ 24 టీబీ 4653 నంబరు గల లారీ రోడ్డుపై ఆగి ఉంది. గమనించని పవన్ అతివేగంతో లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ యాదవ్ తెలిపారు.

Advertisement

Next Story