ఒంటి కాలుపై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

by Naveena |
ఒంటి కాలుపై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
X

దిశ, నాగర్ కర్నూల్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యా శాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో రీతిన ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఒంటికాలుపై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆదివారం నిరసన చేశారు. ఈ సమ్మె దీక్షకు కొల్లాపూర్ పట్టణానికి చెందిన వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సంఘీభావం తెలిపారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కొరకు గత 20 రోజుల నుంచి సమ్మె చేపడుతున్నామని సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీ తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం చూపకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. తాము విద్యాశాఖ తెలంగాణ సమగ్ర శిక్ష ఒప్పంద పద్ధతిలో అర్హతలతో ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైనట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు హోదాల్లో 21 వేలకు పైగా ఉద్యోగులను 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రతకు నోచుకోకపోవడం లేదని ప్రశ్నించారు. కనీస వేతన స్కేలు అమలు చేయడం లేదని ఉద్యోగ భద్రత, ఆరోగ్య ప్రమాద బీమా సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed