- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారం రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలి

దిశ, గద్వాల కలెక్టరేట్ : జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనులను వారం రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో ఉపాధి హామీ పనుల క్రింద చేపట్టిన సీసీ రోడ్లు నిర్మాణపు పనుల పురోగతిపై మండలాల వారిగా ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులలో పూర్తి నాణ్యత, పారదర్శకత పాటించడంతో పాటు, ప్రతి పనికి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. మండలాల వారీగా పూర్తయిన పనుల జాబితా, ఎఫ్ టీ ఓ జనరేషన్, పెండింగ్‌లో ఉన్నవి, పురోగతిలో ఉన్న పనులను నిర్దేశిత సమయంలో, ఎంబీ రికార్డింగ్, ఎఫ్ టీ ఓ జనరేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి పనిలో మెటీరియల్, లేబర్, మిషన్ వినియోగం వివరాలు స్పష్టంగా ఉండాలని, రోజువారీ పనుల నివేదికను సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అన్ని పనులకు సంబంధించిన ఎంబీ రికార్డింగ్ పూర్తయ్యాక వెంటనే ఆన్‌లైన్ ద్వారా అప్లోడ్ చేయాలనీ అన్నారు. స్వయంగా ఫీల్డ్ విజిట్ నిర్వహించి పనుల నాణ్యతను పరిశీలిస్తానని, నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, పంచాయతీరాజ్ ఈఈ దామోదర్ రావు, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.