- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులకు ధ్రువపత్రాల జారీలో తప్పులు లేకుండా చూడాలి
దిశ, నారాయణపేట ప్రతినిధి : విద్యార్థులకు ధ్రువ పత్రాల జారీ విషయంలో తప్పులు లేకుండా చూడాలని, మూడు రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, సీఎం ప్రజావాణి, లోకల్ ప్రజావాణి అంశాలపై శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్ లతో కలిసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల వారీగా బీఎల్ ఓ లు ఇంటింటి సర్వే నిర్వహించి, ఏ ఇంట్లోనైనా ఎక్కువ ఓటర్లు ఉండి, పోలింగ్ కేంద్రాలు వేరువేరుగా ఉంటే సరి చేసి అందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా
తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఒకరికి రెండు ఓట్లు ఉంటే, ఒక ఓటును తొలగించి మరో ఓటును సదరు ఓటరు ఏ పోలింగ్ కేంద్రంలో ఉండాలని కోరుకుంటే అదే పోలింగ్ కేంద్రంలో ఉంచాలన్నారు. ఈనెల 28 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని, అంతలోపు సర్వేకు బీఎల్ఓ లను సంసిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులకు ఇచ్చే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ చేసే విషయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని ఆమె సూచించారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను
ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. వీటితో పాటు లోకల్ ప్రజావాణి, సీఎం రేవంత్ రెడ్డి ( హైదరాబాద్) ప్రజావాణి ద్వారా దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. లోకల్ ప్రజావాణి ద్వారా వచ్చిన 174 దరఖాస్తులలో 84 పెండింగ్ లో ఉన్నాయని, అలాగే సీఎం ప్రజావాణి నుంచి 170 దరఖాస్తులు రాగా 80 ప్రాసెస్ లో ఉన్నాయని, మిగతా 90 పెండింగ్ లో ఉన్నాయని, ఈ రెండు మూడు రోజులలో పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ చేయాలని ఆమె ఆదేశించారు.