- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మారని పరిస్థితి.. కాన్పు కోసం వచ్చిన మహిళను చేర్పించుకోని సిబ్బంది
దిశ, నాగర్‌కర్నూల్: జిల్లాలో ధారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఏవేవో కారణాలు చెప్పి ఆస్పత్రిలో చేర్చుకోకుండా పాలమూరు పొమ్మన్నారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తల్లడిల్లుతూ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హృదయ విదారక ఘటన మరువక ముందే మరో మారు అలాంటి ఘటనే చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఉదయం తాడూరు మండలం బాలన్ పల్లికి చెందిన గర్భిణీ జిల్లా ఆసుపత్రికి రాగ మొదట కాన్పు చేస్తామని చెప్పిన వైద్యులు కోవిడ్ రిపోర్టులు వచ్చే సరికి ఏదేదో కారణాలు చెబుతూ పాలమూరు పోవాలని హెచ్చరించినట్లు తెలిపారు.
దీనిపై సూపరింటెండెంట్ శివరాంని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం విశేషం. ఈ ఘటన సమయంలో మంత్రి ఇదే జిల్లా పర్యటనలో ఉన్నారు. అంతా బాగానే ఉందని గొప్పలు చెప్పుకున్న వైద్యారోగ్యశాఖ పనితీరు ఈ రెండు సంఘటనలు నిదర్శనం.అయితే విషయం తెలుసుకున్న మంత్రి ఘటనకు కారకులైన వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆదేశించినట్లు సమాచారం.