ఉద్యమకారుల కేసులను గత ప్రభుత్వం విస్మరించింది

by Naveena |   ( Updated:2024-11-19 13:56:23.0  )
ఉద్యమకారుల కేసులను గత ప్రభుత్వం విస్మరించింది
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: 2011 లో స్వరాష్ట్ర సాధనకై జరిగిన సకలజనుల సమ్మెలో పాల్గొన్న తమపై నమోదైన పోలీసు కేసులను గత ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పి,మాఫీ చేయకుండా తమను ఇబ్బందులకు గురి చేసిందని తెలంగాణ ఉద్యమకారుడు,టీఎన్జీఓల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ ఆరోపించారు. 2011 నాటి సకలజనుల సమ్మె సందర్భంగా..ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారని నెపంతో..143,341,186,149 సెక్షన్ లతో నమోదైన కేసుల్లోని వారంతా మంగళవారం జిల్లా కోర్టులోని 3 వ అదనపు జూనియర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడ్డాక పదవులను అనుభవిస్తూ,తమపై ఉన్న కేసులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ కేసుల్లో ఉన్నవారందరూ రిటైర్డ్ అయిపోయి..ఆనారోగ్యంతో బాధపడుతూ,కొందరు లేవలేని,నడవలేని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేసును వాదించిన న్యాయవాది వినోద్ కుమార్ మాట్లాడుతూ..కేసు పూర్వాపరాల వాదనలను న్యాయమూర్తి విన్నారని,తదపరి డిసెంబర్ 18 న నిందితులందరూ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed