YS Sharmila: ఎంతో పవిత్రమైన స్థలం ఇది

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-23 12:54:54.0  )
YS Sharmila: ఎంతో పవిత్రమైన స్థలం ఇది
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కడపలో పర్యటించారు. అమీన్ పీర్ పెద్ద దర్గా(Ameen Peer Dargah)లో నిర్వహించిన ఉర్సు ఉత్సవాలల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టు పెట్టారు. ‘కుల మతాలకు అతీతంగా జరిగే కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నాను. సామరస్యానికి, షరతులు లేని ప్రేమకు ప్రతీక ఈ ఉర్సు ఉత్సవాలు. ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన స్థలం.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశం. దైవం మీద నమ్మకం, మానవులందరూ ఒకటే అన్న భావానికి ప్రతీక పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు. హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీ నాయబ్-ఎ-రసూల్ నేర్పిన సూఫీ తత్వాలు, బోధనలు నేటి ప్రజా జీవనానికి ఎంతో ఆదర్శం’ అని షర్మిల పేర్కొన్నారు. కాగా, ఇదే ఉత్సవాల్లో సోమవారం ప్రముఖ సినీ నటులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పాల్గొన్నారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Advertisement

Next Story

Most Viewed