Unstoppable-4: అయాన్ ‘యానిమల్’లో రణబీర్ టైప్.. కొడుకుపై అల్లు అర్జున్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-11-19 15:54:02.0  )
Unstoppable-4: అయాన్ ‘యానిమల్’లో రణబీర్ టైప్.. కొడుకుపై అల్లు అర్జున్ కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి బాలక‌ష్ణ(Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్(Unstoppable Show). ఇప్పటికే 3 సీజన్లు సక్సేస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు అదే జోష్‌లో తాజాగా 4 సీజన్‌లోకి అడుగుపెట్టింది. గతేడాది లాగే.. ఈసారి కూడా ధూమ్ ధామ్‌గా స్టార్ట్ రన్ అవుతోంది. ఇక మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP Cm Chandrababu Naidu)తో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత దుల్కర్ సల్మాన్(Dulquer Salman), సూర్య(Surya) సందడి చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హాజరయ్యారు.

ప్రజెంట్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ (Pushpa-2) చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ షోకు అయాన్ (Ayaan), అర్హ (Arha)తో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇక బాలకృష్ణ అర్హను నీకు తెలుగు వచ్చా అని అడగ్గా.. అర్హ తెలుగులో పద్యం పాడి బాలకృష్ణను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అయాన్ గురించి మాట్లాడుతూ.. ‘వీడు ‘యానిమల్’ మూవీలో రణ్‌బీర్ టైప్.. తండ్రి కోసం ఎదైనా చేస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది.

Read More...

బాలయ్య అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్.. అక్కడ అర్హ ఆ పని చేసి అందరికీ షాక్ ఇచ్చిందిగా


Advertisement

Next Story