- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Atacms: యూఎస్ క్షిపణులతో రష్యాపై ఉక్రెయిన్ దాడి.. ఏటీఏసీఎంఎస్ మిస్సైల్స్ ప్రయోగం
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ప్రయోగించేందుకు అమెరికా అనుమతివ్వడంతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. యూఎస్ తయారు చేసిన ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ (ATACMS)తో విరుచుకుపడింది. బ్రయాన్స్క్ ప్రాంతంపై ఆరు క్షిపణులను ప్రయోగించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం ఆరు మిస్సైల్స్‌తో అటాక్ చేయగా అందులో ఐదింటిని ధ్వంసం చేశామని తెలిపింది. ఒక మిస్సైల్ మాత్రం భూభాగంపై పడినట్టు పేర్కొంది. అయితే శిథిలాలు జనావాసం లేని ప్రాంతాల్లో పడిపోయాయని, భారీగా మంటలు చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడికి రష్యా సైతం దీటుగా స్పందించనున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. కాగా, ఏటీసీఎంఎస్ క్షిపణి వ్యవస్థ అంటే ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. ఇది 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
Read More...
GSAT-20: జీశాట్ 20 ప్రయోగం సక్సెస్.. కక్షలో వదిలిపెట్టిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్