IndiGo Flight : సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో ఫ్లైట్

by M.Rajitha |   ( Updated:2024-11-19 15:39:31.0  )
IndiGo Flight : సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో ఫ్లైట్
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు నుంచి బయలుదేరిన ఓ ఫ్లైట్ లో సాంకేతిక లోపంతో ఆత్యవసర ల్యాండింగ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి మాలె(Banglore to Male) బయలుదేరిన ఇండిగో ఫ్లైట్(IndiGo Flight) లో టెక్నికల్ ప్రాబ్లంను గుర్తించిన పైలెట్లు అత్యవసరంగా కోచి(Kochi) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. కాగా ఈ ఫ్లైట్ లో నలుగురు సిబ్బందితో సహ 140 మంది ఉన్నట్టు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. కాగా ప్రయాణికులను మరో విమానంలో మాలెకు తీసుకెళ్లినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు విమాన యాజమాన్యం క్షమాపణలు తెలిపింది.

Read More...

Air India: థాయ్‌లాండ్‌లో ఆగిపోయిన విమానం.. 80 గంటలు ప్రయాణికుల తీవ్ర అవస్థలు

Advertisement

Next Story