- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Disha Effect : 'పడకేసిన స్వచ్ఛదనం - పచ్చదనం' వార్తతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం...
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక ఆనుకొని ఉన్న పెద్ద పార్క్ పై సోమవారం రాత్రి 'దిశ' లో 'పడకేసిన స్వచ్ఛదనం - పచ్చదనం' పై వచ్చిన వార్త లింక్ ను, బుధవారం జిల్లా టాబ్లాయిడ్ లో వచ్చిన కథనానికి మున్సిపల్ యంత్రాంగం కదిలింది. 'దిశ లింక్' ను చూసిన మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఉదయం 7 గంటలకే పార్కును పరిశీలించి, అక్కడ నెలకొన్న అపరిశుభ్రత పై అసహనం వ్యక్తం చేశారు.
వెంటనే సంబంధిత సూపర్వైజర్లను పిలిచి, కోటిన్నర నిధులతో అందంగా నిర్మించిన పార్కును, అందవిహీనంగా మార్చారని, ఇంత అపరిశుభ్రంగా మారేవరకు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిశలో వచ్చిన వార్తను ప్రస్తావించారు. కమిషనర్ ఆదేశాలు మేరకు మున్సిపల్ యంత్రాంగం మంగళవారం ఉదయం నుండే పార్కు శుభ్రత పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. పార్కు అపరిశుభ్రత పై 'దిశ' లో వచ్చిన కథనానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది.