- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొప్ప మనసు చాటుకున్న హెడ్ కానిస్టేబుల్.. ధైర్యసహసాలతో ప్రాణాలు తెగించి మరీ!
దిశ, వెబ్‌డెస్క్: కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కుండపోత వర్షాలతో గుంటూరు కెనాల్ తెగిపోయి వరద ఉధృతికి కారు కొట్టుకుపోయిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారన్న విషయం తెలిసిందే. ఉప్పలపాడు కాలవలో పడి ఎర్రబాలెంకు చెందిన టీచర్ రాఘవేంద్రరావు, ఉప్పలపాడుకు చెందిన విద్యార్థులు సౌరీష్ బాబు, మాన్విక్ దుర్మరణం చెందారు. అయితే ఈ క్రమంలో నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా తక్షణమే స్పందించిన హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్ అండ్ కానిస్టేబుల్ రాములు ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి మరీ వ్యక్తిని కాపాడారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాములను జిల్లా ఎస్పీ, డీజీపీ జితేందర్, ఐపీఎస్ అభినందించారు.
Telangana Police Twitter Video : https://x.com/TelanganaCOPs/status/1830160385313284576