జూరాలకు పోటెత్తిన వరద..20 గేట్లు ఎత్తివేత

by Aamani |
జూరాలకు  పోటెత్తిన వరద..20 గేట్లు ఎత్తివేత
X

దిశ, గద్వాల ప్రతినిధి : జూరాల ఎగువ కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుకుంటుంది. లక్ష పదమూడు వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్ కు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు లోని 20 గేట్లు తెరిచి 83080 క్యూసెక్కుల నీటిని దిగువకు నది లోకి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు కెపాసిటీ 9.316 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.609 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. పవర్ హౌస్ ద్వారా 34,605 క్యూసెక్కుల నీటిని , నెట్టెంపాడు ప్రాజెక్టు కు 750 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా 1360 క్యూసెక్కుల నీటిని అధికారుల వదులుతున్నారు. మొత్తం ఔట్ ఫ్లో 1,19,842 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ నుండి బయటకు అధికారులు వరద నీటిని వదులుతున్నారు.

Advertisement

Next Story