- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ లోకి ఆగని వలసల పర్వం
దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుండి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం మొదలైంది. గత వారం రోజుల క్రితం అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి పలువురు కీలక నేతలు, నాయకులు వారి అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో కాంగ్రెస్ లోకి చేరారు. తాజాగా బుధవారం కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన సర్పంచ్ రాకేష్ ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ కలగూర గంపగా మారిన నేపథ్యంలో విసుగు చెంది కాంగ్రెస్లోకి వచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు ముందుకు వెళతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతుండగా వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ను ఓడించాలన్న కసితో కొంతమంది నేతలు హస్తం గూటికి చేరుతున్నట్టు సమాచారం.