- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకును మూట కట్టి చెరువులో పడేసిన తండ్రి..
దిశ, కొల్లాపూర్ : కొడుకు చదువుతలేడన్న కోపంతో కన్న తండ్రే గోనె సంచిలో మూట కట్టి చెరువు నీటిలో పడేసి తొక్కుతుండగా చుట్టపక్కల వారు చూసి 100కు ఫోన్ చేయడంతో సకాలంలో కొల్లాపూర్ పోలీసులు స్పందించి బాలుడిని ప్రాణాలతో కాపాడారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్ పట్టణంలో తన 8 ఏళ్ల కొడుకును చదువుకుంట లేడన్న కోపంతో ఓ కన్న తండ్రి విక్షణ కోల్పోయి చితక కొట్టాడు. అంతటితో ఆగకుండా కట్టలు తెగిన కోపంతో గోనె సంచిలో మూటకట్టి ఎవ్వరి కంట్లో పడకుండా తన ఆటోలోనే డ్రైవింగ్ చేస్తూ కొల్లాపూర్ పట్టణ సమీపంలోని మలపురాజు కుంట చెరువు ( పితురికుంట)నీటిలో బుధవారం సాయంత్రం పడేశాడు.
అంతేకాకుండా గోనెసంచిలో తెచ్చిన ఆ మూటను సదరు వ్యక్తి నీటిలో కాళ్ళతో తొక్కుతుండగా ఏడ్పుల శబ్దం ఆ చుట్టు పక్కల వారికి చెవిలో పడింది. చెరువులో ఏదో జరుగుతుందన్న అనుమానంతో 100కు ఫోన్ చేసి అక్కడే ఉండిపోయారు. ఇంతలోనే సంఘటనా స్థలానికి కొల్లాపూర్ ఎస్సై హృషికేశ్ తన సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు. ఇంతలోనే గోనెసంచి మూటలో నుంచి సదరు బాలుడు తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని ఎస్సై అదుపులోకి తీసుకున్నాడు. వెంటనే ఆ బాలుడిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సదరు బాలుడని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి సదరు బాలుడిని వారి వెంట పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు.