- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టన్నెల్ సహాయక చర్యల పురోగతి పై బృందాల వారీగా సమీక్ష..

దిశ, అచ్చంపేట : ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి కోసం జరుగుతున్న అన్వేషణ శనివారం నాటికి 22 రోజులకు చేరుకున్నది. అందుకు సంబంధించిన సహాయక చర్యలు ఇతర పురోగతి పై రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో వేరువేరుగా రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కలెక్టర్ బాధావత్ సంతోష్ సమీక్షలు నిర్వహించారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు..
ఈ సమీక్షలో సహాయక చర్యల పురోగతిని సమీక్షించి, అవసరమైన మార్పులను అమలు చేస్తూ, సహాయక బృందాల ఉన్నతాధికారులు ప్రతిరోజు టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశాన్ని చేరుకొని సహాయక బృందాలకు చేయవలసిన పని పై మార్గనిర్దేశం చేస్తూ, రెస్క్యూ బృందాల మధ్య సమన్వయంతో పనులు వేగంగా జరిగేటట్లు ఈ రోజుకు ఆ రోజులు తక్షణ మార్పులు అవసరాలు సౌకర్యాలు యంత్ర సామాగ్రి సమకూర్పు తదితర చర్యలు తీసుకుంటున్నారు.
అత్యాధునిక రోబోటిక్ పద్ధతులతో ముందుకు..
SLBC టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు అత్యాధునిక రోబోటిక్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అన్వి సంస్థ అభివృద్ధి చేసిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా, 30 HP సామర్థ్యం గల పంపుతో అనుసంధానమైన వాక్యూమ్ ట్యాంక్ ఉపయోగించి నీటితో కూడిన బురద, మట్టిని తొలగించే చర్యలు వేగవంతం చేస్తున్నారు.
డాగ్స్ గుర్తించిన మరో ప్రదేశంలో తవ్వకాలు..
కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ డీ1, డీ2 ప్రదేశాలలో కాకుండా శుక్రవారం అర్ధరాత్రి ఎస్ఎల్బీసీ సొరంగంలో మరోచోట వాసనను బట్టి స్థలాన్ని గుర్తించడంతో ఆ ప్రదేశంలో రెస్క్యూ బృందాలు మృతుల కోసం తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. గత ఆదివారం డాగ్స్ డి వన్ ప్రదేశంలో గుర్తించడంతో అక్కడ ప్రెస్ క్యూబ్ బృందాలు తవ్వకాలు చేయడంతో పంజాబ్ కు చెందిన టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. నాటి నుండి నేటి వరకు మిగతా ఏడుగురి మృతదేహాల లభ్యత ఇప్పటి వరకు ఎక్కడ లభించలేదు.
డీ - వాటరింగ్ ప్రక్రియ..
టన్నెల్‌లోని నీటిని తొలగించేందుకు డీ - వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఆధునిక పరికరాలు, రోబోలను ఉపయోగించి శరవేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, సహాయక బృందాలు, ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యల పురోగతిని సమీక్షించి, అవసరమైన మార్పులను అమలు చేస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయడం కోసం భద్రతా నిపుణుల పర్యవేక్షణలో పనులు కొనసాగిస్తూ, సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నారు.
బృందాలకు భద్రత లక్ష్యంగా..
SLBC వద్ద పనిచేస్తున్న ఆ రెస్క్యూ బృందాలకు ప్రత్యేకంగా, ఆక్సిజన్ సరఫరా, వైద్య సేవలు, ఆహారం, మంచి నీరు వంటి అవసరాలను నిరంతరం అందుబాటులో ఉంచేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. టన్నెల్ లోపల పనిచేసే బృందాల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, అత్యవసర అవసరాల పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నన్నారు. అనంతరం లిక్విడ్ రింగ్ వ్యాక్యూమ్ పంప్, వాక్యూమ్ ట్యాంక్ తో కూడిన మిషన్ పనితీరును కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు పరీక్షత్ మేహార, సింగరేణి మైండ్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు నిరంజన్, డాక్టర్ హరీష్, జీఎస్ఐ అధికారులు తప్లియాల్, హైడ్రాధికారులు కడవర్ డ్రాగ్స్ స్క్వాడ్, ర్యాట్ హోల్ మైనర్స్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణ మధ్య రైల్వే అధికారులు అన్వి రోబోటిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు పరీక్షత్ మేహార, సింగరేణి మైండ్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు నిరంజన్, డాక్టర్ హరీష్, జీఎస్ఐ అధికారులు తప్లియాల్, హైడ్రాధికారులు కడవర్ డ్రాగ్స్ స్క్వాడ్, ర్యాట్ హోల్ మైనర్స్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.