పిడిఎస్ రైస్ తరలింపుకు సహకరించిన కానిస్టేబుల్ కృష్ణయ్య సస్పెన్షన్

by Kalyani |
పిడిఎస్ రైస్ తరలింపుకు సహకరించిన కానిస్టేబుల్ కృష్ణయ్య సస్పెన్షన్
X

దిశ, గద్వాల క్రైమ్ : పిడిఎస్ రైస్ అక్రమ రవాణకు సహకరించిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పిసి: 2258, ఆర్ . కృష్ణయ్య బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ పిడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణ ఉంది. ఈ మేరకు ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టగా ఈ విషయం ఋజువైనందున పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టి ఎస్ సి ఎస్ (సీసీ అండ్ ఏ) రూల్స్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున శాఖపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పోలీసు కానిస్టేబుల్ కృష్ణయ్యను జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు అధికారుల పని తీరును, సమాజంలో వారి ప్రవర్తనను పోలీస్ శాఖ నిశితంగా పరిశీలిస్తుందని, పోలీస్ శాఖలో పని చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed