- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోగులాంబ దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : డీకే అరుణ
దిశ, అలంపూర్ : దేశంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన అలంపూర్ జోగులాంబ మాత దేవాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా జోగులంబ దేవాలయాన్ని సందర్శించి బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆమె పేర్కొన్నారు. జోగులాంబ దేవాలయ విశిష్టతను గురించి స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు సందర్భాలలో ప్రస్తావించారని తెలిపారు. ప్రసాద్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా కేటాయించిందని అన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం అసెంబ్లీలో అంకెల గారడీతో మాయ మాటలు చెబుతున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ అభివృద్ధి కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.