- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి బట్టి..
దిశ, నాగర్ కర్నూల్ : శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. వారితో పాటు విచ్చేసిన ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డిలకు శ్రీశైల దేవస్థానం కమిటీ వేద పండితులతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండిత ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు మట్టి విక్రమార్క మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఉభయ రాష్ట్రాల ప్రజల పై ఉండాలని, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు నిండుగా కురవాలని, కరువు కాటకాలు లేకుండా పంటలు నిండుగా పండాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా ఉన్నత స్థానాల్లో ఉండేలా స్వామి వారి ఆశీస్సులు కావాలని కోరుకున్నట్లు తెలిపారు . తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు విరజిమ్మే శ్రీశైలం హైడల్ ప్రాజెక్ట్ నిర్మించిన నాయకులను స్మరించుకున్నారు. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో తెలంగాణకు 2029-30 వరకు విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు కావలసిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.