టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉచ్చులో మరికొందరు

by Mahesh |   ( Updated:2023-03-28 02:39:17.0  )
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉచ్చులో మరికొందరు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాలు సంచలనం రేపుతున్నాయి. గ్రూప్ వన్ పరీక్షలతో పాటు, ఇంజనీరింగ్ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి... సస్పెన్స్ సినిమాలను తలపించేలా సిట్ అధికారుల విచారణలో ఉమ్మడి జిల్లాలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. సోమవారం గండీడ్ మండలం సల్కర్ పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య సోదరుడు రాజు ను అదుపులోకి తీసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందింది.

సోమవారం సాయంత్రం విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చిన సిద్ధ అధికారుల బృందం తిరుపతయ్య సోదరుడు రాజును ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అన్న విషయం తేలలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే ప్రధాన సూత్రధారులు పంచలింగాల తండాకు చెందిన రేణుక, డాక్య నాయక్, మన్సూర్ పల్లి తండాకు చెందిన రాజేశ్వర్, నీలేష్, గోపాల్ నాయక్, కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయక్ లను అదుపులోకి తీసుకున్న విషయం పాఠకులకు విధితమే.

వీరి ద్వారా లీక్ అయిన పేపర్లు ఎవరెవరికి ఇచ్చారన్న విషయం పై విచారణ జరపడంతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురి పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నవ పేట మండల కేంద్రంలో ఉపాధి హామీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగి, మరి కొంతమంది పేర్లు తెరపైకి రావడంతో ఇటీవల సిట్ అధికారులు నవాబ్ పేటకు చేరుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

అతను ఇచ్చిన సమాచారం ప్రకారం మరో ముగ్గురికి ప్రశ్నాపత్రాలు అందాయి అని తెలియడంతో అధికారులు ఆ దిశగా విచారణ చేసి షాద్నగర్ ఇచ్చింది నా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం పాఠకులకు విధితమే.. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉద్యోగిగా పనిచేస్తున్న తిరుపతయ్య సైతం పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుడు కావడంతో విచారణ జరిపిన అధికారులు.. సోమవారం సాయంత్రం సల్కరిపేట గ్రామానికి చెందిన తిరుపతయ్య సోదరుడు రాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనితో పేపర్ల లీకేజీ వ్యవహారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది.

మరో 7 మంది ఉండవచ్చు అని అనుమానాలు..

టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల వ్యవహారంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 8 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరి కొంతమందికి కూడా పేపర్లు అంది ఉంటాయి అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధి హామీ, తదితర విభాగాలలో పనిచేస్తూ పరీక్షలకు హాజరైన వారిలో మరో ఏడు మంది వరకు ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి విచారణ జరగనుండటంతో మరికొంతమంది అరెస్టు కాక తప్పదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed