- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల శోభకృత్ నామ సంవత్సరం
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉగాది... ప్రతి ఏటా తెలుగు ప్రజలు జరుపుకునే... ప్రకృతి సిద్ధమైన పండగ... లేత చిగుళ్ళు తొడిగిన ప్రకృతి... మత్తెక్కించే కించే కోకిల పాటలు... షడ్రుచుల పచ్చడి... వెలసి ఎదలో... ఉప్పొంగే ఆనందాలు తీసుకువచ్చే ఈ పండుగ.. ఈ ఏడాది శ్రీ శోభక్రుత్ నామ సంవత్సరంగా అడుగుపెడుతుంది.. అని చెప్పడం కన్నా... ఎన్నికల నామ సంవత్సరంగా అడుగు పెడుతుంది అని చెప్పడం సబబుగా ఉంటుంది ఏమో..!? అసెంబ్లీ సాధారణ ఎన్నికలు డిసెంబర్ నెలలో జరగవలసి ఉన్నప్పటికిని.. ఇప్పటికే పల్లెలు.. పట్టణాలలో ఎన్నికల సందడి మొదలైంది.
ఇప్పటికే అధికారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు... వివిధ అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలతో ప్రజల చెంతకు వెళుతుండగా.. ప్రతిపక్ష పార్టీల నాయకులు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నా ఆశావాహులు వివిధ సామాజిక కార్యక్రమాలు... అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పలు కార్యక్రమాలను రూపొందించుకొని ప్రజల చెంతకు వెళుతున్నారు. దీంతో 8 నెలల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి రోజు పండగే అన్నట్లుగా.. సాగిపోనుంది. అధికార... ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సాగే.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. రాజకీయ ఘాటును రేపుతున్నాయి.
తీపి ఎవరికో... కారం ఎవరికో..!?
ఎన్నికలను తెస్తున్న ఈ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మొదటిరోజు అయిన ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తీసుకుని పచ్చడి ఏడాదంతా... మనసుకు హాయినిచ్చి... శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.. ఇది సమపాళ్లలో ఉంటేనే... ఈ అంశాలను రాజకీయాలకు అన్వయించుకుంటే షడ్రుచులు సమపాళ్లలో ఏ పార్టీకి దక్కవు. ఎన్నికల్లో విజయాన్ని పొందే పార్టీలు ఆనందపు తీపులను పంచుకుంటే.. పరాజయం పాలైన పార్టీలు... తమకు కాలం కలిసి రాలేక కారం ఘాటు మిగిలింది కదా అని.. బాధలు పడవలసిన సమయం ఇది.
హోరా... హోరీ తప్పదా..!?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రస్తుతము అధికార పార్టీకి చెందిన వారే.. మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ గెలవాలి అన్న లక్ష్యంతో అధికార పార్టీ నేతలు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువయ్యేలా తమ తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.. మరోవైపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ , బీఎస్పీ పార్టీల నుండి పోటీ చేసి ఎన్నికలలో విజయం సాధించాలన్న తపనతో ఆశావాకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ మంత్రులు ఎమ్మెల్యేలు కాకుండా పలు నియోజకవర్గాలలో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.
ఎంచుకున్న నియోజకవర్గాలలో కార్యక్రమాలతో ప్రజలు చెంతకు వెళుతున్నారు. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేలా బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ సిట్టింగ్ లను ఓడించే పరిస్థితులు నెలకొన్నాయి. మరి కొన్ని సమీకరణలు అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయనున్నాయి.. ఈ క్రమంలో ఈ శోభకృత్ నామ సంవత్సరం ఎవరికి తీపిని మిగులుస్తుందో... మరి ఎవరికి కారం ఘాటును మిగిలిస్తుందో చూడాలి.