జాతీయ పతాకానికి అవమానం..?

by Aamani |
జాతీయ పతాకానికి అవమానం..?
X

దిశ, అచ్చంపేట : జాతీయ జెండాను జాతీయ పండుగల సందర్భంగా ఎంతో భక్తిశ్రద్ధలతో జాతీయ పతాకాన్ని అధికారులైన, అనధికారులైన ఎగరవేసిన అనంతరం సాయంత్రం సూర్య హస్తం కాకముందే జాతీయ పతాకాన్ని గౌరవప్రదంగా కిందకి దించవలసి ఉంటుంది. కానీ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం బి.కే లక్ష్మాపూర్ పంచాయతీ వద్దా 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జాతీయ పతాకాన్ని ఎగురవేసి సాయంత్రం అంతే గౌరవంగా కిందికి దించాలి. కానీ నిర్లక్ష్యంగా గ్రామపంచాయతీ వద్ద ఉన్న జాతీయ పతాకాన్ని సాయంత్రం 6:30 అవుతున్నప్పటికీ కిందికి దించకపోవడం తో జాతీయ పతాకానికి అవమానం జరిగిందంటూ ? గ్రామస్తులు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు వర్షంలో జాతీయ నాయకుల చిత్రపటాలు తడుస్తూ మరింత అవమానకరంగా ఉందని గ్రామంలో చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed