- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Harish Rao : రైతుబంధు ఇవ్వని ప్రభుత్వంపై ఊరుకుందామా...? ఉరికిద్దామా..!!?
దిశ, వనపర్తి : రైతుబంధు ఇవ్వని ఈ రాష్ట్ర ప్రభుత్వం పై ఊరుకుందామా..!? ఉడికిద్దామా..!!? తేల్చుకుందాం అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు( MLA Harish Rao ) అన్నారు. మంగళవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి( Former minister Niranjan Reddy ) అధ్యక్షతన వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు ప్రజా నిరసన కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాల సంగతి అటు ఉంచి ఉన్న పథకాలను ఊడ గొడుతున్నారు అని ఆరోపించారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ చేసి తీరుతాము అని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, జోగులాంబ మాత, కురుమూర్తి స్వామి పై ప్రమాణాలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు గుప్పించారు. కానీ ఇంతవరకు రుణమాఫీ చేయలేదు.. రైతుబంధు ఇవ్వలేదని అన్నారు.
దీంతో రైతుల కడుపులు మాడుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. 11 నెలలు దాటుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను ఎగవేస్తున్నారే తప్ప.. ఒరగబెట్టింది ఏమీ లేదు అని చెప్పారు. రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూసీ నది సుందరీకరణ పేరుతో రూ. 1,50,000 కోట్లు ఢిల్లీకి మోస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లు లేవు, రెండు లక్షల రుణమాఫీ లు లేవు అని చెప్పారు. కరోనా కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు ఉన్న రైతులకు ఇబ్బందులు కలవద్దు అని రైతుబంధు అమలు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు.
రాష్ట్రంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్కరి లెక్కలు రాసుకుంటున్నాం. కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన పార్టీపరంగా అన్ని విధాల అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ సహకారంతో వనపర్తి ని వరి పంటల ధాన్యాగారంగా మార్చారని చెప్పారు. ఇంజనీరింగ్, మెడికల్, ఫిషరీస్ కళాశాలలను తెచ్చిన ఘనత దక్కుతుందని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ సీ లు దేశాపతి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్ర శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు కృపానందం గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.