విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

by Javid Pasha |
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
X

దిశ, శ్రీరంగాపూర్: మండలంలోని శేరుపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాల స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులు, డీఈవో, ఇతర అధికారులుగా వ్యవహరించారు. ఎస్.అపర్ణ ప్రధానోపాధ్యాయురాలిగా, వినయ్ కుమార్ మండల విద్యాధికారిగా, దినేష్ జిల్లా విద్యాధికారిగా వ్యవహరించారు. మొత్తం 26 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి బోధనోపకరణాలు, స్వయం అభ్యసన సామాగ్రితో చాలా చక్కగా తరగతులను నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

తరగతుల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన చిన్నారి లక్ష్మి ప్రసన్నకు మొదటి బహుమతి, చిన్నారి రాజేశ్వరికి ద్వితీయ బహుమతి, చిన్నారి రూపకు తృతీయ బహుమతితోపాటు పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందన బహుమతులను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి , ఎస్ఎంసి ఛైర్మన్ దశరథం, ఉపాధ్యాయులు నరసింహ, రమేష్, నరసింహ, రాజు, శశికళ, నర్మద, ఎస్ఎంసి కోఆప్షన్ సభ్యురాలు గీత, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, సమీప పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Advertisement

Next Story