- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా జైలులో సీనియర్ సివిల్ జడ్జి ఆకస్మిక తనిఖీ
X
దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని జైలును శనివారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఎంకే పద్మావతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీల కోసం జైలులో కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. వంటశాలను సందర్శించి ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ఖైదీలతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. తర్వాత ఖైదీల కోసం 'జైలు అదాలత్' కార్యక్రామన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఖైదీలకు ఉన్న హక్కుల గురించి మాట్లాడారు. ఫ్రీ లీగల్ ఎయిడ్, ఫోక్సో యాక్టు, లీగల్ సర్వీసెస్ యాక్టుల గురించి తెలుపుతూ 'ప్లీ బార్గనింగ్' గురించి ఖైదీలకు వివరించారు. ఆమె వెంట జైలు సూపరెండెంట్ వెంకటేశం,జైలర్ శ్రీనివాసులు, అడ్వకేట్ విజయమోహన్ తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story