- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరగబడదాం.. తరిమికొడదాం ప్రచారంలో సరిత
దిశ, గద్వాల టౌన్ : గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు, నాగర్ దొడ్డి గ్రామాలలో బుధవారం తిరగబడదాం తరిమికొడదాం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి సరిత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవితో కలిసి ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలతో పాటు ప్రజలందరు పెద్ద ఎత్తున సరితకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇద్దరు ఒక్కటేనని గద్వాలలో ఈ రెండు కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. వీళ్ళు ఏమాత్రం గ్రామాలు అభివృద్ధి చేయలేదని, గద్వాల అభివృద్ధి కొరకు మీ బహుజన బిడ్డగా ముందుకు వచ్చానని, మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేతులు రాని ఒకే కుటుంబ నాయకుల పరిపాలనతోనే గ్రామాల అభివృద్ధి చెందలేదని, రోడ్లు, పాఠశాలలు, మౌలిక సదుపాయాలు లేక గ్రామప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తానని సరిత హామీ ఇచ్చారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, చేనేత, కల్లుగీత కార్మికులకు చేయూతగా 4 వేల రూపాయలు, రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు, రైతు బంధు కింద ఏటా ఎకరానికి 15 వేలు, కౌలు రైతులకు 12 వేల రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్ రెడ్డి, గంజిపేట శంకర్, నల్లా రెడ్డి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జాకీర్, గార్లపాడు మల్లేష్, నెట్టెంపాడు గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ కతలప్ప, తదితరులు పాల్గొన్నారు.