- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశం గర్వించదగ్గ వ్యక్తి సంత్ సేవాలాల్
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి
దిశ, నారాయణపేట ప్రతినిధి: దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక వేత్త, సంఘ సేవకులు సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో సేవాలాల్ 284వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, ఆర్దీవో రాంచందర్, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చడం వల్ల లంబాడా ప్రజలు ఎక్కడైనా ఒకే రకంగా మాట్లాడుకోగలుగుతున్నారని తెలిపారు. అంతకు ముందుగా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ గోపాల్, కృష్ణమాచారి, కిష్టా నాయక్ గోపాల్ రాథోడ్,లక్ష్మణ్ నాయక్, రాజారాం, కృష్ణా నాయక్, కిషన్ నాయక్, మోహన్ నాయక్, సిద్దు చౌహన్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందుగా సుభాష్ రోడ్ నుంచి సిటిజన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యేను సన్మానించిన వాల్మీకి బోయలు...
నారాయణపేట క్యాంపు కార్యాలయములో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు బుధవారం ఎమ్మెల్యే యస్. రాజేందర్ రెడ్డిని జిల్లా వాల్మీకి బోయ సంఘం తరపున గజమాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి బోయలు చేస్తున్న పోరాటకల నెరవేరిందని అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేను సన్మానించినవారిలో స్టీరింగ్ కమిటీ సభ్యులు లొట్టి శీను(ఎల్.ఎస్) కండక్టర్ వెంకట్రాములు, పట్టణ అధ్యక్షులు బోయ లక్ష్మణ్, వెంకట్ రాజ్ అడ్వకేట్, బోయ రమేష్, సైకిల్ రాములు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన పారిశుధ్య కార్మికులు
నారాయణపేట మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు సంఖ్యను పెంచాలని, అలాగే అర్హత కలిగిన వారిని పర్మినెంట్ చేయాలని కోరుతూ మున్సిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి కలిసి విన్నవించారు.