- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత..
దిశ, మక్తల్ : సంగంబండలం వాగు నుండి మక్తల్కు అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఇసుక నియంత్రణ పై విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు దాడి చేసి ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్కు తరలించగా మక్తల్ ఎస్సై పర్వతాలు ఆదివారం కేసునమోదు చేశారు. మక్తల్ మండలంలోని పెద్దవాగు నుండి అక్రమ ఇసుక తరలింపును నియంత్రించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు వంతుల వారిగా వాగు పరిసరాల్లో వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున వాగు నుండి అక్రమ ఇసుక తరలిస్తున్న సమాచారం రావడంతో వీఆర్ఏలు దాడి చేసి ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించగా మక్తల్ ఎస్సై పర్వతాలు కేసునమోదు చేసినట్టు ఆయన తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రోజు సెలవు దినం కావడం వల్ల అధికారులు ఎవరూ రారన్న ఉద్దేశంతో ఆదివారం రోజు తెల్లవారుజామున సంగంబండ వాగు నుండి నాలుగు ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారం వీఆర్ఓలకు చేరిందన్నారు. దాంతో వారు అక్కడికి వెళ్ళే సమయానికి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు తప్పించుకోగా ఒక ట్రాక్టర్ దొరికిందని తెలిపారు. తప్పించుకుపోయిన మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసునమోదు చేయాలని సంగంబండ గ్రామస్తులు అంటున్నారు.