- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MP Mallu Ravi : ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ
దిశ,గద్వాల: ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ నందు ఎంపి మల్లు రవి,జడ్పీ మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలు తీసుకొని వచ్చి సాంకేతిక విప్లవాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం విమానయానం టెలి కమ్యూనికేషన్ కంప్యూటర్ల ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ఆ రంగాన్ని ప్రోత్సహించాడని తెలిపారు. ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన ఆ సంస్కరణలతోనే ప్రస్తుతం దేశం టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతుందన్నారు. .ఆ మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణని ప్రపంచంలో అభివృద్ధి లో మేటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.