MLA Yennam Srinivas Reddy : విలువలతో కూడిన విద్యను అందించండి..

by Sumithra |
MLA Yennam Srinivas Reddy : విలువలతో కూడిన విద్యను అందించండి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : విలువలతో కూడిన విద్యను చిన్నారులకు అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పోచమ్మ కాలనీలో నూతనంగా 'మై చోట స్కూల్' ను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి ప్రసంగించారు. ఈ చోట స్కూల్ కు వచ్చే చిన్నారులు సున్నితమైన వారని, వారిని ఆత్మీయంగా తమ వైపు మలుచుకొని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఉత్తమ పరిమాణాలు పాటిస్తూ, మంచి ఫలితాలతో ఉన్నత పాఠశాలగా చేరుకునే దిశగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ వనజ వెంకటయ్య, ఇమ్మడి పురుషోత్తం, రాకేష్, రామస్వామి, కిరణ్, శివకుమార్, శ్రీధర్, శ్రీమఖ్ నాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కుంటను తలపించేలా బాలాజీ నగర్...

పట్టణంలోని 11 వ వార్డు బాలాజీ నగర్ మెయిన్ రోడ్ లో కుంటను తలపించేలా నిలిచిన వర్షపు నీటిని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్ లు పరిశీలించారు. కాలనీలో కలియ తిరుగుతూ డ్రైనేజీ వ్యవస్థ పనితీరును కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంబడి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed