నిజాయితీ విద్యార్ధికి పోలీస్ సలాం

by Kalyani |
నిజాయితీ విద్యార్ధికి పోలీస్ సలాం
X

దిశ, పెద్దకొత్తపల్లి: ఓ వృద్ధురాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు ఓ విద్యార్థికి దొరకడంతో ఆ నగలను పోలీసులకు అప్పగించి పోలీసులతో శభాష్ అనిపించుకున్నారు. అంతే కాదు .. పోలీసుల చేత శాలువా తో సన్మానం పొందాడు. ఆ విద్యార్థి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పిల్లి చంద్రమ్మ అనే వృద్ధురాలు తన కూతురు గ్రామమైన కల్వకోల్ కు సోమవారం వెళ్ళింది. అయితే ఆ గ్రామంలో పొరపాటున తన ఒంటి పై ఉన్న 2 తులాల 3 మాసాల బంగారు నాను(అభరణం) పోగొట్టుకున్నది.అయితే మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో కల్వకోల్ గ్రామానికి చెందిన విద్యార్థి చించేటి సాయికుమార్ తండ్రి సత్యం కు దొరికింది. ఆ బంగారాన్ని నిజాయితీతో సదరు విద్యార్థి తన తండ్రితో కలిసి వచ్చి పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. నిజాయితీతో తనకు దొరికిన బంగారాన్ని అప్పగించిన విద్యార్థి సాయికుమార్ ను కొల్లాపూర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ , స్థానిక ఎస్సై సతీష్ శాలువాతో సత్కరించి, కొత్త దుస్తులు, షూ ఇచ్చి అభినందించి పోలీస్ అధికారులతో శభాష్ అనిపించుకున్నారు. విద్యార్థి సాయికుమార్ తన నిజాయితీని చాటుకొని పలువురికి ఆదర్శంగా నిలిచి అభినందనలు పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed