నేటి నుంచే ఆపరేషన్ ముస్కాన్-10 ప్రారంభం

by Kalyani |
నేటి నుంచే ఆపరేషన్ ముస్కాన్-10 ప్రారంభం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-10 సోమవారం ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమలు,వ్యాపార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించనున్నట్లు,బాలబాలికలను పనిలో పెట్టుకున్న యాజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రత్యేక బృందాల ద్వారా పట్టుకున్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించి,తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం,అనాధ పిల్లలైతే వారిని సంరక్షణ గృహాలకు తరలించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 కానీ 1098 కు కానీ,జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712659360 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed