నది బయోటెక్ ఉద్యోగులు మరోసారి ధర్నా...

by Sumithra |
నది బయోటెక్ ఉద్యోగులు మరోసారి ధర్నా...
X

దిశ, మానవపాడు : పది నెలలుగా పస్తులు ఉంటూ కుటుంబాలు రోడ్డున పడ్డ నదిబయోటెక్ కంపెనీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడంలేదని అందులో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు కంపెనీ ముందుధర్నా చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని కల్కుంట్ల గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి నది బయోటెక్ కంపెనీ కొనసాగుతుంది. ఏడాది నుండి కంపెనీ రన్ కాకపోవడంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు.

దీంతో కంపెనీ ముందు ఉద్యోగులు కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడనుండి కదిలేది లేదని బీష్మించి కూర్చున్నారు. స్పందించిన కంపెనీ యాజమాన్యం మురళీకృష్ణ, కృష్ణకాంత్, జూన్ 15 వరకు గడువు ఇవ్వాలని వారితో కోరారు. మే 15లోపు కొన్ని నెలల జీతం అందిస్తామని, మిగతా జీతం డబ్బులను జూన్ 15 లోపు అందించి కంపెనీని రీఓపెన్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు కార్మికులు ధర్నాను విరమించుకున్నారు.

Advertisement

Next Story