- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తుతెలియని వాహనం ఢీకొని మున్సిపల్ అటెండర్ మృతి
దిశ, జడ్చర్ల : గుర్తు తెలియని వాహనం ఢీకొని జడ్చర్ల మున్సిపాలిటీ అటెండర్ కృష్ణయ్య (65 ) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావిరమ్మపేట వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బాలనగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన కృష్ణయ్య ఆదివారం జడ్చర్ల నుంచి బాలనగర్ వెళ్లడానికి జాతీయ రహదారి దాటుతుండగా..హైదరాబాద్ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. మృతుడు గతంలో తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ ఏ గా విధులు నిర్వహించే వాడని, గత ప్రభుత్వం కృష్ణయ్యను జడ్చర్ల మున్సిపల్ అటెండర్ గా నియమించడంతో జడ్చర్లలో విధులు నిర్వహిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. అతను మృతి చెందడం బాధాకరమని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.