- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JEE-Advanced: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ అడ్వాన్సుడ్-2025 పరీక్ష తేదీ ప్రకటన..!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రతి ష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IIT), ఎన్‌ఐటీ(NIT)ల్లో బీటెక్(B.Tech) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్(JEE-Advanced) పరీక్ష తేదీ వచ్చేసింది. 2025 మే 18న ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జేఈఈ-అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష నిర్వహణ బాధ్యతను తీసుకున్న ఐఐటీ కాన్పూర్(IIT Kanpur) ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ పరీక్షను రెండు పేపర్లుగా కండక్ట్(Conduct) చేస్తారన్న విషయం తెలిసిందే. పేపర్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 12 వరకు జరగనుండగా..పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డుల(Admit Cards)ను ఎగ్జామ్ మూడు రోజుల ముందు నుంచి అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/ ద్వారా డౌన్ లోడ్(Download) చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్షకు 2024 మార్చి లేదా 2025 మార్చిలో ఇంటర్(Inter) పాసైన వారు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు ఉత్తీర్ణులైన వారికీ ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు.