- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Chandrababu: నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. వారితో వర్చువల్‌గా భేటీ

దిశ, వెబ్‌డెస్క్: అధికారిక కార్యక్రమాల్లో భాగంగా కాసేపట్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) గుంటూరు జిల్లా (Guntur District) తాటికొండ (Thatikonda) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరుకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్ల పాల్గొని జిల్లా ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR. Ambedkar) జయంతిని పురస్కరించుకుని తాడికొండ (Thatikonda) మండల పరిధిలోని పొన్నెకల్లు (Ponnekallu)లో అంబేడ్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.
అక్కడి నుంచి నేరుగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అంబేడ్కర్ విద్యా పథకం కింద సాయం పొంది విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యా్ర్థులతో ఆయన వర్చువల్ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి – బంగారు కుటుంబాలతో సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు (CM Chandrababu భేటీ కానున్నారు.