అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం.. సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2025-04-14 04:32:02.0  )
అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం.. సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ జయంతి (Dr. BR Ambedkar Birth Anniversary) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababau Naidu) ఆసక్తికర ట్వీట్ చేశారు. అంబేద్కర్ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఘన నివాళులు (Great Tribute) అర్పించారు. దీనిపై చంద్రబాబు.. "ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది" అని భారతరత్న డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్ (Br. BheemRao Ramji Ambedkar) అన్నారని గుర్తు చేశారు.

ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా.. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని, దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని సీఎం రాసుకొచ్చారు.

అలాగే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ట్విట్టర్ లో.. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించారు. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని, భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘమని తెలిపారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని, అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం (Coalition Government) పనిచేస్తోందని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed