ఎక్సైజ్‌ శాఖ ఆపరేషన్ దూల్ పేట్

by Kalyani |
ఎక్సైజ్‌ శాఖ ఆపరేషన్ దూల్ పేట్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : గంజాయి అమ్మకాలకు నెలవుగా మారిన ధూల్‌పేట్‌ పై ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరం చేసింది. ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాస్ రెడ్డి ఆదేశాలతో అమ్మకాలను పూర్తిగా నిర్మూలించేందుకు గత జూలై నెల నుండి ఆబ్కారిశాఖ మొదలు పెట్టిన ‘‘అపరేషన్‌ ధూల్‌పేట్‌ ’’విజయవంతంగా కొనసాగుతోంది . స్థానికంగా గంజాయి అమ్మకాలపై ఎక్సైజ్‌, ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ నిఘా పెట్టడం, నిందితులను పట్టుకొవడం, కోర్టుల చుట్టూ తిప్పిడం, గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు తీసుకుంటుండడంతో గంజాయి అమ్మకాలు దాదాపుగా నియంత్రణ లోకి వచ్చాయి. క్వింటాళ్ల గంజాయి అమ్మకాల నుంచి కిలోల స్థాయికి అమ్మకాలు పడిపోగా అమ్మకందార్లు దూల్ పేట్ ను విడిచి నగర శివారు

ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.

గంజాయి నిర్మూలన పై అవగాహన సదస్సు..

ధూల్‌పేట్‌ అపరేషన్‌లో భాగంగా దాదాపు నాలుగు నెలల నుంచి ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిషేదిత గంజాయి విక్రయాలు చేపడుతున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిలో అవగాహన కల్పించేందుకు స్థానికంగా అధికారులు అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు . వీటిల్లో ఎక్సైజ్‌ ఉన్నతాధి కారులు గంజాయితో సంబంధం ఉన్న వారికి చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గంజాయి అమ్మకాలు పూర్తిగా మానివేయాలని కోరారు. మళ్లీ అమ్మకాలు, కొనుగోలు చేపడితే మాత్రం 68 ఎఫ్ /ఎన్‌డిపిఎస్‌ యాక్ట్‌ ద్వారా అస్తుల జప్తు , పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికితోడు ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి

అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించడం సత్ఫలితాలను ఇస్తోంది.

218 మందిపై కేసులు నమోదు- పరారీలో 67 మంది…

ఆపరేషన్ ధూల్ పేట్ లో భాగంగా ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిత్యం దాడులు చేయడం ద్వారా నాలుగు నెలల వ్యవధిలో 61 కేసులలో 218 మంది గంజాయి విక్రేతలపై కేసులు నమోదు చేశారు. వీరిలో 40 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు . 141 మందిని బైండోవర్ చేయగా 15 మందిపై జరిమానా విధించారు. 128 కేసుల్లో చార్జీ షీట్‌ వేశారు. పోలీసు కేసులకు భయపడి మరో 67 మంది పరారయ్యారు. గత జూలై నుండి అపరేషన్‌ ధూల్‌పేట్‌లో భాగంగా 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 4.2 కేజీల హషీష్‌ అయిల్‌ తో పాటు 38 ద్విచక్రవాహనాలు , రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

అమ్మకాలు పూర్తిగా నిలిపి వేయాల్సిందే…

వీబీ కమలాసన్‌రెడ్డి - . ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ …

ధూల్‌పేట్‌లో గంజాయి అమ్మకాలను పూర్తి స్థాయిలో నిలిపివేయాల్సిందే. నాడు నాటుసారా తయారీ, అమ్మకాలను నియంత్రించినట్లుగానే గంజాయి అమ్మకాలను కూడా పూర్తిగా నియంత్రించాలి. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌ విషయంలో చాల సీరియస్‌గా ఉంది. గంజాయి, డ్రగ్స్‌ విషయంలో ఎవ్వరిని ఉపేక్షించే పరిస్థితులు లేవు. గంజాయి , ఇతర మత్తు పదార్ధాల అమ్మకాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా దూల్పేట్ వాసులకు గంజాయి గంజాయి అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలి. ఇందుకోసం అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలి

Advertisement

Next Story