Bangladesh: చిన్మోయ్ కృష్ణదాస్‌ను వెంటనే రిలీజ్ చేయాలి.. త్రిపురలో భారీ ర్యాలీ

by vinod kumar |
Bangladesh: చిన్మోయ్ కృష్ణదాస్‌ను వెంటనే రిలీజ్ చేయాలి.. త్రిపురలో భారీ ర్యాలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇస్కాన్ చీఫ్ చిన్మోయ్ కృష్ణాదాస్‌ (Chinmoy krishna das)ను వెంటనే విడుదల చేయాలని, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ త్రిపుర రాజధాని అగర్తలా(Agarthala)లో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ (VHP )కి అనుబంధంగా ఉన్న హిందూ సంఘర్ష్ సమితి (hindu sangarsh Samithi) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయం దగ్గర ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహ్మద్‌కు మెమోరాండం అందజేశారు. అయితే ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 50 మంది నిరసన కారులు ఒక్కసారిగా బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలోకి చొరబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. బంగ్లాదేశ్ హైకమిషన్ ప్రాంగణంలోకి చొరబడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తు్నట్టు తెలిపింది. ఇది తీవ్ర విచారకరమని అభివర్ణించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్సులర్ (Consular) ఆస్తులను లక్ష్యంగా చేసుకోవద్దని పేర్కొంది. న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్, దేశంలోని ఇతర కార్యాలయాల భద్రతను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Advertisement
Next Story

Most Viewed