క్రీడాకారులు గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలి.. ఎమ్మెల్యే

by Sumithra |
క్రీడాకారులు గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలి.. ఎమ్మెల్యే
X

దిశ, కొత్తకోట : క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకొని తోటి క్రీడాకారులకు ఆదర్శంగా నిలవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో జీఎంఆర్ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్ కీశే. చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో మన ప్రాంతంలో క్రీడల్లో ఎవరైతే బాగా రానిస్తారో అలాంటి వారిని ప్రభుత్వ పరంగా తీర్చిదిద్ది ప్రోత్సహిస్తామని చెప్పారు.

ఈ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతిగా 50 వేల రూపాయలుగా నిర్వాహకులు ప్రకటించారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, క్రీడాకారులకు ఎమ్మెల్యే జీఎంఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదనపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి యన్.బోయేజ్, పి.కృష్ణారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, అడ్వకేట్ మునగారి కృష్ణ, మండల అధ్యక్షులు బీచుపల్లి యాదవ్, పట్టణ అధ్యక్షులు మేస్త్రి శ్రీను, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మీషేక్, సలీం ఖాన్, ఎండి లతీఫ్, సుభాష్, జెసీబీ రాము, సంద వెంకటేష్, అమ్మపల్లి బాలకృష్ణ, జేకే రాజు, తదితరులు పాల్గొన్నారు. ‌

Next Story

Most Viewed