- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health Tips : ఐదు పొరపాట్లు.. అనేక సమస్యలు.. రాత్రిళ్లు ఈ పని మాత్రం చేయకండి!!
దిశ, ఫీచర్స్ : ఏ పనీ చేయకున్నా అలసిపోవడం, అకస్మాత్తుగా కళ్లు తిరగడం లేదా మసకబారడం, ఏకాగ్రతను కోల్పోవడం, జ్క్షాపక శక్తి తగ్గడం, డిప్రెషన్‌కు లోనవడం, తలనొప్పి వంటి సమస్యలను ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ మొదట నిద్రలేమితో ప్రారంభమయ్యే ప్రాబ్లమ్స్‌గానే ఎక్కువా ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పడుకోవడానికి ముందు చేసే కొన్ని పొరపాట్లే అందుకు కారణం అవుతున్నాయని పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం.
మెలటోనిన్‌పై ప్రభావం
చాలా మందికి నిద్ర రాకపోవడానికి కారణం స్లీపింగ్ హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి కాకపోవడమే. రాత్రిళ్లు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వంటివి చూడంవల్ల ఈ విధమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ల వల్ల కళ్లపై, మెదడుపై ప్రభావం పడుతుంది. కాబట్టి నిద్రపోయేకంటే ఒక గంట ముందు నుంచే ఎలక్ట్రానిక్ డివైజెస్‌కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.
ఆహారం, పానీయాలు
కొందరు రాత్రిపూట పడుకోవడానికి ముందే కాఫీ, టీ, వేడి వేడి పాలు తాగడం లేదా చిప్స్, స్వీట్లు వంటివి తినడం చేస్తుంటారు. అయితే కాఫీ, టీలు కెఫిన్ కంటెంట్‌ను కలిగి ఉండటంవల్ల నిద్ర రాకుండా చేస్తాయి. చిప్స్, స్వీట్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి పడుకోవడానికి ముందు కెఫిన్ రిలేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలి.
సరైన షెడ్యూల్ లేకపోవడం
దేనికైనా ఒక టైమ్ టేబుల్ మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా నిద్రపోవడానికి, మేల్కోవడానికి కూడా ఇది చాలా ముఖ్యం. ఒకే టైమ్ ప్రకారం తినడం, నిద్రపోవడం, మేల్కోవడం వంటివి మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా రోజుకో టైమ్‌కు పడుకోవడం, మేల్కోవడం వంటివి కంటిన్యూ అయితే క్రమంగా నిద్రలేమికి, తద్వారా ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. కాబట్టి సరైన షెడ్యూల్‌ను మెయింటైన్ చేయడం ముఖ్యం.
నిద్రకు ముందు వ్యాయామాలు
కొందరు ఉదయం టైమ్ దొరకలేదనో, ఫిట్‌నెస్ మీద ఆసక్తితోనో నిద్రపోయేకంటే ముందు వ్యాయామాలు చేస్తుంటారు. అయితే తిన్న వింటనే కాసేపు నడక అవసరం కానీ, నిద్రకు ముందు వ్యాయామాలు మాత్రం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాత్రిళ్లు హెవీ వర్కౌట్స్ నిద్రలేమికి దారితీస్తాయని, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
స్ట్రెస్, యాంగ్జైటీస్
నిద్రపట్టకపోవడానికి రాత్రిపూట స్ట్రెస్, యాంగ్జైటీస్ కూడా మరో ప్రధాన కారణం. అతి ఆలోచనలు, రోజువారీ సమస్యలు ఈ పరిస్థితికి దారితీస్తుంటాయి. దీంతో కంటిమీద కునుకు పట్టదు. అయితే ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. సో.. పడుకునే ముందు ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు. కాసేపు మెడిటేషన్ లేదా పుస్తకం చదవడం వంటివి చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళలను డైవర్ట్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. అయినా ఫలితం లేకపోతే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Skin care Tips: ప్యాచీ స్కిన్ పోగొట్టే బెస్ట్ రెమిడీస్..!